1. నీ అనుదిన వాక్యం ధ్యానము ద్వారా దేవుడు తన చిత్తమును బయలు పరుస్తారు. మనము ఏ విషయము కొరకు ప్రార్ధించుచున్నామో, మన వాక్యభాగములో ఆయా వచనములు మన హృదయమును తాకేలా చేస్తారు.
2. మనస్సాక్షి ద్వారా దేవుడు తన చిత్తము బయలు పరుస్తారు. ఏదైన పని పూనుకున్నపుడు దేవుడు హృదయములో నెమ్మది అనుగ్రహిస్తారు. దేవుని చిత్తము కాని ఎడల హృదయములో శాంతి, సమాధానములు వుండవు.
3. పరిస్థితులు బట్టి కూడా దేవుడు తన చిత్తాన్ని బయలు పరుస్తారు. దేవుని చిత్తము అయిన యెడల పరిస్థితులు అన్నీ మనకు అనుకులముగా ముందుకు తీసుకువెళ్తాయి.
దేవుని చిత్తము కాని యెడల ఆటంకములు ఎదురవుతాయి.
4. వ్యక్తులు ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలు పరుస్తారు. పెద్దల ద్వారా, దేవుని సేవకుల ద్వారా దేవుని చిత్తమును బయలుపరుస్తారు.
5. కలల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలు పరుస్తారు. మనము నిద్రిస్తున్నప్పుడు కలల రూపములో దేవుడు తన చిత్తమును బయలుపరుస్తారు.
6. దర్శనాల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలు పరుస్తారు. మనము ప్రార్ధన చేస్తున్నప్పుడు, ధ్యానములో ఉన్నప్పుడు, దేవుడు తన దర్శనముల ద్వారా దేవుడు తన చిత్తమును బయలుపరుస్తారు.
7. సూచనల ద్వారా దేవుడు తన చిత్తాన్ని బయలు పరుస్తారు. మనము దేవుని సూచనలు అడిగినప్పుడు ఆయన సూచనల నెవెర్పు ద్వారా తన చిత్తమును బయలుపరుస్తారు.